ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా
కదలని హో శిలనే అయినా
తృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట.. నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇలాగే కడదాకా హో ప్రశ్నయి ఉంటానంటున్నా
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్నా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు
అనొద్దు దయయుంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకు సరిపడు
అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్లుగా
తన వెన్నంటి నడిపినా
చేయూత ఎవరిది
నా ఎదలయను కుశలము అడిగినా
గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనదా
అనగనగా అంటూనే ఉంటా
ఎపుడు పూర్తవనే అవక
తుది లేని కధ నేనుగా
గాలివాటంలాగా ఆగే అలవాటే లేక
కాలు నిలువదు ఏ చోట...నిలకడగా
ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక...మౌనంగా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు
అనొద్దు దయయుంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకు సరిపడు
అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్లుగా
తన వెన్నంటి నడిపినా
చేయూత ఎవరిది
నా ఎదలయను కుశలము అడిగినా
గుసగుస కబుర్ల ఘుమఘుమలెవరివి
లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా... విన్నారా
నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా
రాకూడదు ఇంకెవరైనా
అమ్మ ఒడిలో మొన్న
అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది
జాబిల్లి ఎంత దూరాన ఉన్నా
వెన్నెలగా చెంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది... జోలాలి
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే
తానే నానే నానినే